వాతావరణ కథనాన్ని సవాలు చేయడం. భావోద్వేగ స్థితిస్థాపకత కోసం యువత నేతృత్వంలోని సాక్ష్యం-ఆధారిత ఉద్యమం.
M.O.C.H.I. అంటే ఏమిటి?
MOCHI అనేది వాతావరణ మార్పుల మధ్య వృద్ధి చెందడానికి అవసరమైన వనరులను అందించడానికి ఏర్పాటు చేయబడ్డ ఒక్క పాపరస్పర సంభాషణ, యువత-కేంద్రీకృత ఉద్యమం. విజ్ఞాన శాస్త్రం, ప్రకృతి మరియు ఇతరులతో నిమగ్నమయ్యేలా యువకులను ప్రోత్సాహించి దాని ద్వారా మానవత్వం మరియు మన గ్రహంతో లోతైన సంబంధాన్ని పెంపొందించడానికి MOCHI రూపొందించబడింది.
భవిష్యత్తు తరానికి ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో మద్దతు అందిస్తోంది
MOCHI మానవత్వం మరియు మన గ్రహంతో లోతైన సంబంధాన్ని పెంపొందిస్తుంది. ఆన్లైన్లో, MOCHI గ్రాహం యొక్క భవిష్యత్తు గురించి గొప్ప విజ్ఞానం మరియు వాతావరణ మార్పు గురించి నైపుణ్యం గల సంబంధాని యువతకు అందచేస్తూ వారి మానసిక ఆరోగ్యంపై కూడా అవగాహన కలిగిస్తుంది. ఆఫ్లైన్లో, MOCHI యువతను ఆరుబయటకు వెళ్ళడానికి మరియు ప్రకృతితో మరియు ఇతరులతో విలువగల సంబంధాన్ని ఏర్పరుచుకొనుటకు ప్రోత్సహిస్తుంది.
MOCHI యొక్క ఐదు సిద్ధాంతాలు : Mindful( శ్రద్ధ), Optimistic (ఆశావాద), Compassionate (కరుణ), Healing (వైద్యం), Innovations (ఆవిష్కరణ).
Mindful( శ్రద్ధ)
రాబోయే వాతావరణ విపత్తుకు తక్షణ నిర్ణయం మరియు చర్య అవసరం. మనం ఎలా స్పందిస్తామనేది ముఖ్యం. మన ప్రతిస్పందనలు ఉద్దేశపూర్వకంగా పెరగాలి, తొందరపాటు లేదా ప్రేరణ కాదు. భవిష్యత్ ఫలితాల యొక్క విభిన్న శ్రేణిని మనం ఊహించుకోవాలి మరియు ప్రయోజనకరమైన వాటికి మద్దతు ఇచ్చే పరిష్కారాలను ఎంచుకోవాలి. నేటి ఎంపికలు రేపటి పరిణామాలు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి.
Optimistic (ఆశావాద)
ఆశావాదం సందేహమై ఉన్నప్పటికీ అనుకూల ఫలితం ఆచరణీయమైనదని నమ్మడంపై ఆధారపడి ఉంటుంది. మన భవిష్యత్తును ఊహించేటప్పుడు, ఆశావాదం యొక్క ప్రధాన రూపం ఓపెన్ మైండ్ను నిర్వహించడం. దీనిపై దృడవిశ్వాసము కలిగివుడటం వలన మన గ్రహం మరియు మానసిక ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే పరిష్కార-ఆధారిత ఆలోచనా విదానాన్ని ప్రోత్సహిస్తుంది. మన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మనం ఆశాజనకంగా ఉందాం.
Compassionate (కరుణ)
కరుణ అనేది అంగీకారం మరియు వినయం నుండి పుడుతుంది. వినయం మనకి సాంస్కృతిక విభజనులకు అతీతంగా చూడటానికి మరియు మన భాగస్వామ్య మానవత్వాన్ని గ్రహించేలా చేస్తుంది. అంగీకారం మన విజయాలు మరియు ఓటమిలను అంగీకరించమని ప్రోత్సహిస్తుంది. మనమందరం మన వ్యక్తిగత భాగాల మొత్తం కంటే గొప్పదానితో రూపొందించబడ్డామని గుర్తించడం వల్ల మన పట్ల, ఇతరుల పట్ల మరియు మానవుల కంటే ఎక్కువగా కనికరం చూపగలుగుతాము.
Healing (వైద్యం)
వైద్యం అనేది వ్యక్తిగత, సామాజిక మరియు ఆర్థిక స్థాయిలో అవసరం. శతాబ్దాల అహంభావవం మరియు చిన్న చూపుతో కూడిన నిర్ణయాలు మనల్ని మానవ ప్రపంచం కంటే ఎక్కువ దూరం చేశాయి. మన సామాజిక మరియు ఆర్థిక నిర్మాణాలలో మరియు సహజ ప్రపంచంతో సంబంధానికి మద్దతు ఇచ్చే విలువల వ్యవస్థలలో లోపాలకి మానవుడు సవాలుగా మారాలి. సయోధ్య (విభేదాలు తొలఁగించుకొని ఏర్పరుచుకొను స్నేహము) మాత్రమే వాతావరణ సంక్షోభాన్ని అంతం చేస్తుంది మరియు ప్రకృతిని నయం చేస్తుంది. కాబట్టి మనం మరింత నైతిక మరియు పర్యావరణం విలువలను కలిగిన మానవజాతిగా మారాలి.
Innovation (ఆవిష్కరణ)
ఇప్పటికే ఉన్న వాతావరణ పరిష్కారాలను రూపొందించే సాధారణ వాక్చాతుర్యాన్ని మరియు ఆలోచన విధానాలని మనం సవాలు చేయాలి. ఎలా? వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరిగే సంబంధిత పోరాటాలోనూ మరియు ఆర్ధిక ప్రక్రియలను మరింత మార్చే కొత్త సాధనాలు, ఆలోచన విధానాలు మరియు వనరులతో. అందువల్ల, మనస్సాక్షికి సంబంధించిన మెరుగుదల మరియు కొత్తదనం కోసం మనం ప్రయత్నించాలి.
మా గురించి
మా నిపుణులు, విద్యార్థులు మరియు స్వచ్ఛంద సేవకుల బృందం బహుళ-తరాలు మరియు అంతర్జాతీయలు . మా సంఘంలో శాస్త్రవేత్తలు, కళాకారులు, గేమ్ డెవలపర్లు, సంగీతకారులు మరియు సామాజిక మీడియా వ్యూహకర్తలు, వారు వాతావరణానికి సంబంధించిన సాక్ష్యాలు, మరియు పరిష్కార-ఆధారిత డిజిటల్ విషయాలను రూపొందించడానికి పరస్పరం సహకరించుకుంటారు, మార్గదర్శకులుగా ఉంటారు మరియు ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకుంటారు . మేము ఎల్లప్పుడూ కొత్త సహకారాన్ని సృష్టించడానికి మరియు ఇతరులతో కలిసి పని చేయటానికి అవకాశాల కోసం చూస్తున్నాము.
మేము ఎల్లప్పుడూ కొత్త సహకారాన్ని సృష్టించడానికి మరియు ఇతరులతో కలిసి పని చేయటానికి అవకాశాల కోసం చూస్తున్నాము.
మీరు పాల్గొనాలనుకుంటే మాకు ఇమెయిల్ పంపండి!
The Game (త్వరలో వస్తుంది!)
"Kibou - The Guiding Light" అనేది ప్రేక్షకులందరికీ తగిన మూడవ-వ్యక్తి, కంప్యూటర్, యాక్షన్-అడ్వెంచర్ (చర్య-సాహసం) వీడియో గేమ్.
పాలపుంత నుండి పది లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బాణసంచా గెలాక్సీలో భూమి లాంటి గ్రహం Kibou పై గేమ్ తయారు చేయబడింది. Mochi లు Kibou నివాసులు, వారి సాంకేతికంగా అభివృద్ధి చెందిన జీవనశైలి వారిని అతి పెద్ద నగరాలలో నివసించేలా చేసింది. యుక్త వయసుగల Mochi లు గ్రహం యొక్క మఅతి పెద్ద నగరాలకు దూరంగా ఉన్న మారుమూల గ్రామాలలో నివసిస్తున్నారు. నగర జనాభా తరచుగా ఈ Mochi ని పట్టించుకోదు, గ్రామీణులు అని కూడా పిలుస్తారు, ఎందుకంటే వారి జీవన విధానం ప్రకృతి మరియు సాంకేతికత మధ్య సమతుల్యత సూత్రంపై ఉద్భవించిందని వారు గుర్తించరు.
గ్రహంలోని అత్యధిక జనాభా ఉన్న ప్రాంతంలో ఆట మొదలుఅవుతుంది. యువ Mochi Ki Kibou మరొక చివరలో నివసించే సన్నిహిత స్నేహితుడితో వీడియో చాట్ చేస్తున్నాడు. ఇద్దరు స్నేహితులు వారి Mochi భాషలో మాట్లాడుతున్నారు, ఇటీవలి వాతావరణ సంఘటనలు చాలా తీవ్రంగా మారాయి… వారి సంబంధాలకు (కనెక్షన్లకు) అంతరాయం ఏర్పడినప్పుడు మానవులు అర్థం చేసుకోలేరు.
ఆట యొక్క లక్ష్యం: ఆటగాళ్ళు Kibou యొక్క మరొక చివరలో ఉన్న Ki స్నేహితుని చేరుకోవాలి. కానీ ఆట యొక్క పరివర్తన లక్ష్యాలు పర్యావరణ-ఆందోళనను తగ్గించడం మరియు వాతావరణ సంక్షోభం యొక్క పరిష్కారాల వైపు చర్య తీసుకోవడానికి ప్రోత్సాహాన్ని పెంచడం. ఆట ప్రతి ఒక్కరికీ తగినది, అయితే ఇది యుక్తవయసు గలవారు మరియు యువకులు, వారి అధిక దుర్బలత్వాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యావరణ ఆందోళనకు రూపొందించబడింది.
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
సాంఘిక ప్రసార మాధ్యమం (సోషల్ మీడియా) ప్రచారం
వాతావరణ మార్పు క్లిష్టమైనది. భావోద్వేగాలు కూడా ఉంటాయి. వాతావరణ సంక్షోభం గురించి గందరగోళంగా మరియు విరుద్ధమైన ప్రసార వార్తసేకరణ కూడా సహాయం చేయదు. ఈ గందరగోళాన్ని తగ్గించడంలో సహాయపడటానికి మరియు డూమ్ అండ్ గ్లూమ్ కథనాన్ని సవాలు చేయడానికి, మేము #Mochi4theplanet ప్రారంభిస్తున్నాము.
ఇది ఏమిటి? ఈ సాక్ష్యం-ఆధారిత సాంఘిక ప్రసార మాధ్యమం ప్రచారం యువతతో మానసికంగా సంబంధం కలిగి ఉంటుంది, గ్రహం మరియు ఒకరినొకరు చూసుకోవడంలో ఎక్కువ ప్రయోజనం, సంస్థ మరియు బాధ్యతతో వారిని సిద్ధం చేస్తుంది.
మేము దీన్ని ఎలా చేస్తున్నాము? వాతావరణ మార్పుల చుట్టూ ఉండే సాధారణ అపోహలు, భయాలు మరియు భావోద్వేగాలను పరిష్కరించడంలో పాల్గొటు, ఇంటరాక్టివ్ సైన్స్-ఆధారిత సమాచారం, సాధనాలు మరియు వనరులు. విభిన్న భావోద్వేగాలను ఉత్తమంగా ఎలా ఉపయోగించుకోవాలో, వాతావరణ మార్పులకు సంబంధించిన సవాళ్లను , భయాలను ఎలా అధిగమించాలో వివరించి మరియు సాక్ష్యం-ఆధారిత కథనాలు, బ్లాగులు, వీడియోలు మరియు యానిమేటెడ్ సిరీస్లను ఆశించండి.
ఎందుకు ఇలా చేస్తున్నాం? తరువాతి తరంకి ఆశను సాకారం చేయడానికి, పరిష్కార-ఆధారిత కథనాలను రూపొందించాలని మరియు యువకులు సౌకర్యమైన అనుభూతిని మరియు ఆత్మవిశ్వాసంతో సహచరులతో, స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో వాతావరణ మార్పుల గురించి హృదయపూర్వకంగా మాట్లాడాలని మేము కోరుకుంటున్నాము.
Mochiని సుపరిచితమైన ఇంకా చైతన్యవంతమైన ప్రదేశంలో కలుసుకోండి – సాంఘిక ప్రసార మాధ్యమం- మరియు విశ్వవ్యాప్త సంబంధం, కథనం యొక్క శక్తి మరియు స్థితిస్థాపకత కోసం మానవ సామర్థ్యాన్ని కనుగొనండి.
@mochi4theplanetని అనుసరించండి